సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదాభార్గవి
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి
ఆత్మకూరు, సోమా వెంకటసుబ్బయ్య , మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం ఉదయం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి పరిశీలించారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 7/1, 8/1, 9/1, 9/2, 10/1 నంబర్లు గల హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి, అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, ఓటర్లందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
జిల్లా ఎన్నికల పరిశీలకురాలి వెంట ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి తదితరులు ఉన్నారు.