ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు...
సీతానగరం, సూర్య : విజయనగరం డిప్యూటీ కమీషనర్ మరియు పార్వతీపురం మన్యం డిపి ఈఓ వారి ఆదేశాలు మేరకు సీతానగరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి.పద్మావతి ఎస్ఎస్టిటీం (డిప్యూటీ ఎంపీడీవో) కేకే వర్మ తో కలిసి సీతానగరం మెయిన్ రోడ్ జంక్షన్ వద్ద స్థానిక ఎలక్షన్ కోడ్ సందర్భం గా అక్రమ మద్యం మరియు నాటుసారాయి నివారణ లో భాగముగా వాహనాల తనిఖీ నిర్వహించడం అయినది. ఎక్కడైనా క్రయ విక్రయాలు జరిగినా, రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే తమకు తెలియజేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఐ సింహాచలం, సీతానగరం పోలీస్ స్టేషన్ హెచ్ సి కమలాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.