BREAKING
దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కు నివాళులు - ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరు నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘హై’ మూవీ.. దర్శకుడిగా ఎస్ కృష్ణ సరికొత్త ప్రయత్నం టీడీపీలో చేరిన వైకాపా యువ నాయకులు మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. రికార్డు ధర పలికే అవకాశం ఉన్న టాప్ స్టార్స్ వీళ్లే 130 మంది రక్తదానం ఇండోనేషియాలో వ్యూహాత్మక విద్యార్థి నిరసనలు పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్ష ఫీజు చెల్లించిన ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రోళ్ల సుధాకర్ రెడ్డి అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తులతో నివాళి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంరక్షక ప్రభుత్వ ప్రధానిగా నెతన్యాహు బ్రిటన్ పన్ను విధానాలపై బెట్టింగ్ దిగ్గజం ఎంటైన్ హెచ్చరిక ఉద్యోగాన్ని వదిలి.. ప్రజాసేవ వైపు! ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా మొజాంబిక్‌కు చైనా ఆర్థిక ఊరట.. రుణ చెల్లింపుల పునర్వ్యవస్థీకరణకు కీలక ఒప్పందం స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొనడంతో భారీగా ప్రాణనష్టం

రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక

Select Suryaa Now
రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక

ఆమనగల్లు రంగారెడ్డి: రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీ క అని, స్వచ్ఛందంగా యువత రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవడంఅభినందనీయమని మహేశ్వరం డిసిపి నారాయణరెడ్డి చెప్పారు. బుధవారం ఆమనగల్లు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో లైన్స్ క్లబ్, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని స్థానిక సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మహేశ్వరం డిసిపి నారాయణరెడ్డి, ఏసిపి జానకి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విధి నిర్వహణలో అసువులు బాసిన దివంగత ఎస్సై కాసం  హనుమంత రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం డిసిపి నారాయణరెడ్డిమాట్లాడుతూ పోలీస్ ఫ్లాగ్  డే వీక్ -2026, పోలీస్అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.విధి నిర్వాహణలో దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సమాజ సేవలోభాగంగా రక్తదాన కార్యక్రమాలుచేపడుతున్నట్లు చెప్పారు. రక్తదానం ఎంతో విలువైన సామాజిక సేవ అని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించి ప్రాణాలను కాపాడవచ్చు అని అన్నారు. రక్తదానం పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ రక్తం దానం చేయాలని  ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలనిసూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని చెప్పారు. ప్రజలు మహిళల భద్రత పై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని డిసిపి కోరారు. శిబిరంలో  రక్తదానం చేసిన 120 మందికి ప్రజా ప్రతినిధులు, నాయకులు, పోలీస్ అధికారులు, లైన్స్ క్లబ్ సభ్యులు ప్రశంశాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, కౌన్సిలర్లు, ఎస్సై లు సంతోష్ రెడ్డి, శేఖర్ ,మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి,  యువకులు, ఏబీవీపీ నాయకులు, వైద్యులు, లైన్స్ క్లబ్ సభ్యులు,స్థానికులు, వివిధ మండలాల యువకులు పాల్గొన్నారు.

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.