చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
ఆమనగల్లు రంగారెడ్డి:
ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించే నిరసన సభను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు. బుధవారం ఆమనగల్లులోమాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, పౌరుల ఓటు హక్కును కాపాడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఓటు హక్కు పరిరక్షణ కోసంనిర్వహిస్తున్న పోరాటంలోప్రజాస్వామ్యవాదులు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.