BREAKING
మీ బిడ్డగా ఆదరించి... గెలిపించండి 32వ డివిజన్ లోని సమస్యలన్నిటిని 6 నెలల్లోగా పరిష్కరిస్తాం... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టి వెంకట కీర్తి... జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతి. శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ విజయ్ దంపతులు కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి లెనిన్ పాండియన్ మూవీ రివ్యూ, వ్యవస్థపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి: రామాయణం సినిమా నుండి కమనీయమైన జతగూడె పాట విడుదల శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నైస్ పౌండేషన్ వంశధార కు భారీ వరదలు 41 వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... కార్పొరేటర్ గా నసీమున్నీసా ను గెలిపించండి.. టీడీపీ మేయర్ అభ్యర్థి జెబీ శ్రీనివాస్

సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి*

Select Suryaa Now
సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి*

 

- *నేరేడుచర్ల ఎస్సై  గోపాల్ రెడ్డి*

*నేరేడుచర్ల,మేజర్ న్యూస్*

ప్రస్తుత సమాజంలో యువత, మహిళలు, విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అవగాహనతో పాటు అప్రమత్తత కలిగి ఉండటం వల్ల నేరాలని అరికట్టవచ్చని  నేరేడుచర్ల ఎస్ఐ సిహెచ్ గోపాల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సైబర్ ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ అనర్దాలు, సురక్షిత డ్రైవింగ్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్లు వినియోగంలో వ్యక్తిగత గొప్యత పాటించాలన్నారు. అనవసరమైన సమాచారము, వ్యక్తిగత ఫోటోలు వేరే వారితో పంచుకోవడం వల్ల జరిగే అనర్దాలను వివరించారు. ఆన్లైన్ సైబర్ మోసాలకి గురైతే 1930 కు కాల్ చేయాలని,మహిళలు, విద్యారినులు అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్ లకు,ఆకాతాయి  వేధింపులకు గురైతే 1945 కి కాల్ చేయాలన్నారు. సోషల్ మీడియా యాప్సులలో ప్రొఫైల్ సెట్టింగ్స్ ని సెక్యూరిటీ లాక్ చేసుకోవడం వల్ల వ్యక్తిగత సమాచారం గొప్యంగా ఉంచుకోవచ్చుని అన్నారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకి దూరంగా ఉండాలని, క్షణకాలం ఆనందం కోసము జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు. మైనర్ డ్రైవింగ్,రాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం ద్వారా జరిగే ప్రమాదాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కొణతం సీతారాoరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.వి.చారి,ఉపాధ్యాయులు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.