BREAKING
దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కు నివాళులు - ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరు నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘హై’ మూవీ.. దర్శకుడిగా ఎస్ కృష్ణ సరికొత్త ప్రయత్నం టీడీపీలో చేరిన వైకాపా యువ నాయకులు మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. రికార్డు ధర పలికే అవకాశం ఉన్న టాప్ స్టార్స్ వీళ్లే 130 మంది రక్తదానం ఇండోనేషియాలో వ్యూహాత్మక విద్యార్థి నిరసనలు పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్ష ఫీజు చెల్లించిన ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రోళ్ల సుధాకర్ రెడ్డి అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తులతో నివాళి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంరక్షక ప్రభుత్వ ప్రధానిగా నెతన్యాహు బ్రిటన్ పన్ను విధానాలపై బెట్టింగ్ దిగ్గజం ఎంటైన్ హెచ్చరిక ఉద్యోగాన్ని వదిలి.. ప్రజాసేవ వైపు! ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా మొజాంబిక్‌కు చైనా ఆర్థిక ఊరట.. రుణ చెల్లింపుల పునర్వ్యవస్థీకరణకు కీలక ఒప్పందం స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొనడంతో భారీగా ప్రాణనష్టం

ప్రచారంలో దూసుకెకుతున్న షకీలా

Select Suryaa Now
ప్రచారంలో దూసుకెకుతున్న షకీలా

ప్రచారంలో దూసుకెళ్తున్న డాక్టర్ షకీలా 
--ఆనం కైవల్యా రెడ్డి తో ఇంటింటా ప్రచారం 
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య : కూటమి ఆధ్వర్యంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ షకీలా సోమవారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్య రెడ్డితో కలిసి ఆమె 1వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల విశేషాధరణ లభిస్తుండడం తో ఆమె ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఆయా వార్డుల్లో మహిళలు మంగళ హారతులతో, జనాలు పూలమాలలు శాలువాలతో సన్మానిస్తూ అఖండ స్వాగతం పలుకుతూ చిరకాలంగా సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం, అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన ఆనం రామనారాయణ రెడ్డి సేవలను తాము గుర్తిస్తున్నామని, చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా కు సంపూర్ణ మద్దతు ఇస్తామని, ఆమె విజయం సంకల్పంగా భావిస్తామని సర్వత్రా పేర్కొంటున్నారు.దాదాపు 40 సంవత్సరాలుగా బొమ్మిరెడ్డి కుటుంబఅగ్రజుడు డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర్ రామిరెడ్డి మూడు దపాలు శాసనసభ్యులుగా ప్రజలకు సేవలు అందించడంతోపాటు, తుదిశ్వాస విడిచే వరకు పేదల వైద్యుడిగా పేరుగాంచి వైద్య సేవలు అందించారు. ఆయన కుమారుడు, షకీలా భర్త అయిన బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆత్మకూరు మండలాధ్యక్షుడుగా, ఆత్మకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ గా, జిల్లా టెలికం సభ్యులుగా, ఆత్మకూరు ఆర్టిసి నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడుగా అన్ని వర్గాల ప్రజలకు, కార్మికులకు విశేష సేవలు అందించారు. డాక్టర్ షకీలా బి ఎస్ ఆర్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలందించడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ఆమె నిర్వహించారు. ఆమె తనయుడు, యువ నేత బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి బిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గా అనేక సామాజిక సేవలను అందించారు. దాంతోపాటు ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా నాడు,నేడు ఆత్మకూరు అభివృద్ధికి అనూహ్యంగా  కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆనం అభివృద్ధి, బొమ్మిరెడ్డి కుటుంబం అందించిన సేవలు వెరసి డాక్టర్ షకీలా కు అనూహ్య  ప్రజాదరణ లభిస్తుంది. విజయ పదం వైపు దూసుకెళుతుందని సర్వత్ర అభిప్రాయపడుతున్నారు. ప్రచార కార్యక్రమంలో డాక్టర్ షకీలా తో పాటు ఆనం కైవల్యా రెడ్డి తెలుగు మహిళా నాయకురాలు పులిమి శైలజా రెడ్డి, ఆయా వార్డుల తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థులు, ఆయా ప్రాంతాల తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.