BREAKING
జర్నలిస్టులపై వేధింపుల కేసు..బ్రిటన్ మితవాద కార్యకర్త టామీ రాబిసన్‌కు దోషిగా కోర్టు తీర్పు రేమండ్ లైఫ్‌స్టైల్ త్రైమాసిక ఫలితాల్లో పడిపోయిన లాభాలు మాల్తుమ్మెద చెన్నకేశ్వర ఆలయం గుట్టపై చిరుత పులి సంచారం క‌ల‌క‌లం. త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను తలకిందులు చేసిన బీఎన్‌పీ పరిబాస్ అప్పుల ఊబిలో రైతులు ఆదుకునే వారేలేరా.. హీరో మోటోకార్ప్ త్రైమాసిక ఫలితాల్లో నిరాశ తప్పుడు ధ్రువపత్రంతో భూమి విరాసత్‌.. కేసు నమోదు తర్వాతి తరపు యుద్ధ విమాన ప్రాజెక్ట్‌పై జర్మనీ పునరాలోచన ఆస్ట్రేలియాకు తాండూరు కందుల తొలి ఎగుమతి.. అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణకు గుర్తింపు ఉత్తర కొరియాపై మరోసారి అమెరికా కఠిన ఆంక్షలు పెద్దగట్టుకు రాష్ట్ర పండుగ హోదా.. అభివృద్ధికి రూ.100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి:డా శివ ప్రసాద్ యాదవ్ ఆఫ్రికా దేశాల భాగస్వామ్య సదస్సులో పుతిన్ కీలక వ్యాఖ్యలు ఎస్‌హెచ్‌ఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు “మందు తాగి చస్తామంటేనే స్పందిస్తారా?”.. ఎనిమిదేళ్ల భూ సమస్యపై కదిలిన రెవెన్యూ అధికారులు రువాండా రక్షణ మంత్రిత్వ శాఖపై అమెరికా తీవ్ర ఆంక్షలు.. కాంగో ఘర్షణల నేపథ్యంలో సంచలన నిర్ణయం

ఎల్లంపేటలో భవన నిర్మాణంపై ఆరోపణలు.. అధికారుల తనిఖీలు ఎప్పుడు..?

Select Suryaa Now
ఎల్లంపేటలో భవన నిర్మాణంపై ఆరోపణలు.. అధికారుల తనిఖీలు ఎప్పుడు..?
మేడ్చల్, మేజర్ న్యూస్: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో ఓ భవన నిర్మాణంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పాత భవనంపై అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నారని, నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌లు వదిలారా? పార్కింగ్‌కు తగిన స్థలం కేటాయించారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు ఉన్నాయా? మంజూరైన ప్లాన్‌ ప్రకారమే పనులు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.భవనం పక్కనే ఉన్న గ్రామకంఠ స్థలాన్ని ఆక్రమించినట్లు గతంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలేమిటో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామకంఠ స్థలానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించి, స్థల హద్దులను నిర్ధారించిన తర్వాతే ఆక్రమణ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
భవనానికి అవసరమైన సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్ సదుపాయాలు, అదనపు అంతస్తుల నిర్మాణానికి సంబంధించిన అనుమతులను టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయా లేదా అనేది విచారణలో తేలాల్సి ఉంది. సంబంధిత అధికారులు స్పందించి సమగ్ర తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలు ఉన్నట్లు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
 
రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.