BREAKING
శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 1.38 కోట్లు ఏసీబీ వలలో లీగల్‌ మెట్రాలజీ అధికారి!* రుద్రవనం పీఎస్ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ 35వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో 40 కుటుంబాలు చేరిక సమ్మర్ హాలిడేస్ ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: హీరో శ్రీవిష్ణు 'తులాభారం' సెట్స్‌లోకి అడుగుపెట్టిన రవితేజ.. 'క్రైమ్ మహారాజా'గా నవ శకం ప్రారంభం ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కు నివాళులు - ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరు నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘హై’ మూవీ.. దర్శకుడిగా ఎస్ కృష్ణ సరికొత్త ప్రయత్నం టీడీపీలో చేరిన వైకాపా యువ నాయకులు మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. రికార్డు ధర పలికే అవకాశం ఉన్న టాప్ స్టార్స్ వీళ్లే 130 మంది రక్తదానం ఇండోనేషియాలో వ్యూహాత్మక విద్యార్థి నిరసనలు పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్ష ఫీజు చెల్లించిన ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రోళ్ల సుధాకర్ రెడ్డి

పెద్దగట్టుకు రాష్ట్ర పండుగ హోదా.. అభివృద్ధికి రూ.100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి:డా శివ ప్రసాద్ యాదవ్

Select Suryaa Now
పెద్దగట్టుకు రాష్ట్ర పండుగ హోదా.. అభివృద్ధికి రూ.100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి:డా శివ ప్రసాద్ యాదవ్

 

యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి కొలువైన పెద్దగట్టు జాతరకు రాష్ట్ర పండుగ హోదా కల్పించాలని సహస్ర ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డా. చినుకని శివ ప్రసాద్‌ ప్రభుత్వాన్ని కోరారు. మేడారం జాతర తరహాలో పెద్దగట్టుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు కల్పించడంతోపాటు, సమగ్ర అభివృద్ధికి రూ.100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

పెద్దగట్టు జాతర యాదవుల ఆధ్యాత్మిక విశ్వాసానికి, తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం రహదారుల విస్తరణ, తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్‌, వైద్య సేవలు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పెద్దగట్టును ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర పండుగ హోదాతోపాటు ప్రత్యేక నిధులు కేటాయించి, శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.