ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్...
సూర్యాపేట క్రైమ్ మేజర్ న్యూస్
సూర్యాపేట జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం!
రైతులు: వరి ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లతో కప్పి భద్రపరచుకోవాలి వరి కోతలు వాయిదా వేసుకోవడం మంచిది.
వాహనదారులు: నెమ్మదిగా వాహనాలు నడపాలి. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.
విద్యార్థులు పాఠశాల వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ ప్రమాదాలు విద్యుత్ స్తంభాలు తీగలు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి. తెగిపడిన తీగలను తాకరాదు. నీటి ప్రవాహాలు: వాగులు, వంకలు, వరద నీటిలోకి దిగరాదు.
పోలీసుల సూచనలు: అధికారుల హెచ్చరికలు సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేయండి.
ప్రజల భద్రతే ముఖ్యం.అప్రమత్తంగా ఉండండి ప్రమాదాలను నివారించండి అని జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ తెలిపారు.