కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయండి
మర్రిపాడు మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మర్రిపాడు మండల కేంద్రంలోని చంద్ర లాడ్జి ప్రాంగణంలో మండల నాయకులతో బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంగినేని ప్రసన్నను సైకిల్ గుర్తుపై అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి ఆనం ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని, మండలంలోని ప్రజలందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. మండలంలో కూటమి తరఫున ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న ఆరుగురు అభ్యర్థుల విజయానికి తెలుగుదేశం, జనసేన శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజయాన్ని కానుకగా అందించాలని పిలుపునిచ్చారు.
మండలంలో ఇప్పటికే ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంపై సంబంధిత అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఏకగ్రీవాలతోనే ఎన్నికల బాధ్యత పూర్తయినట్లు భావించకూడదని, ఎన్నికల బరిలో ఉన్న మిగిలిన కూటమి అభ్యర్థుల విజయానికి కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు, పార్టీ నాయకులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రతి స్థానంలోనూ కూటమి బలాన్ని నిరూపించేలా నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు.ఎన్నికల్లో విజయం సాధించాలంటే నాయకుల మధ్య ఐక్యత, కార్యకర్తల సమష్టి కృషి, ప్రజల మద్దతు అత్యంత కీలకమని పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ ప్రతి ప్రాంతంలో కూటమి అభ్యర్థులకు ప్రజాదరణ పెరిగేలా కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో మండల నాయకులు తమ అభిప్రాయాలను మంత్రికి వివరించారు. పార్టీ శ్రేణులందరినీ సమన్వయం చేసుకుంటూ, కూటమి అభ్యర్థుల విజయమే ధ్యేయంగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టి, అభ్యర్థుల గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. సోమశిల హైలెవెల్ కెనాల్పనులు ప్రారంభమయ్యాయని త్వరలో పూర్తి చేసి మండల ప్రజలకు సాగు త్రాగు నీరు అందిస్తామన్నారు. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పధకాలను అమలు చేస్తామని చెప్పాము. చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పెన్షన్లు అందిస్తున్నాము. కుటుంబంలో చదువుకుంటున్న ఎంతమంది ఉన్నా అందరికి తల్లికి వందనం ఇస్తున్నామన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవపధకం క్రింద ప్రతి ఏడాది రూ 20వేలు వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తుంది. మహిళా శక్తి పధకం క్రింద ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం.ఉచిత బస్సు ప్రయాణంలో 100కోట్లు మంది మహిళలలు ప్రయానించగారూ మూడు వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించా మన్నారు. మహిళలకు ఎడాదికి ఉచితంగా 3గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ పుట్టం శ్రీనివాసులురెడ్డి, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుట్టం బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎంపీపీ రమణయ్య, ఏకగ్రీవంగా ఎంపికైన నూతన ఎంపీపీ అభ్యర్థి విజయనిర్మల రెడ్డి, ఏ ఏం సి చైర్మన్ జనార్దన్ నాయుడు, జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీప్రసన్న, మండల కన్వీనర్ దేవరాల గంగాధర్ యాదవ్, మాజీ మండల ఉపాధ్యక్షులు కోనంకి శ్రీనివాసులు నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి, బుదవాడ సొసైటీ ప్రెసిడెంట్ వనిపెంట వెంకట సుబ్బారెడ్డి, భీమవరం సొసైటీ ప్రెసిడెంట్ ఎర్రమళ్ళ చిన్నారెడ్డి, ఏకగ్రీవమైన ఎంపీటీసీలు, బరిలో ఉన్న ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.