భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే..-తహసీల్దార్ శ్రీకాంత్
భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే..
-తహసీల్దార్ శ్రీకాంత్
బెజ్జంకి/మేజర్ న్యూస్:
గ్రామాల్లో రైతుల భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే ప్రభుత్వం భూముల రీ సర్వే చేపట్టిందని తహసిల్దార్ శ్రీకాంత్ అన్నారు.మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న భూభారతి-భూమూల రీ సర్వే ప్రక్రియను తహసిల్దార్ శ్రీకాంత్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ రీ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.రైతులు తమకు సంబంధించిన భూపత్రాలు సిద్ధంగా ఉంచుకుని సర్వే సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు.అలాగే ప్రభుత్వం అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా భూ రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని తహసిల్దార్ శ్రీకాంత్ సర్వే సిబ్బందికి సూచించారు.జీపిఓ రజిత,సర్వేయర్లు,రైతులు పాల్గొన్నారు.(సూర్యరిపోర్టర్,భాస్కర్,బెజ్జంకి)