BREAKING
జర్నలిస్టులపై వేధింపుల కేసు..బ్రిటన్ మితవాద కార్యకర్త టామీ రాబిసన్‌కు దోషిగా కోర్టు తీర్పు రేమండ్ లైఫ్‌స్టైల్ త్రైమాసిక ఫలితాల్లో పడిపోయిన లాభాలు మాల్తుమ్మెద చెన్నకేశ్వర ఆలయం గుట్టపై చిరుత పులి సంచారం క‌ల‌క‌లం. త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను తలకిందులు చేసిన బీఎన్‌పీ పరిబాస్ అప్పుల ఊబిలో రైతులు ఆదుకునే వారేలేరా.. హీరో మోటోకార్ప్ త్రైమాసిక ఫలితాల్లో నిరాశ తప్పుడు ధ్రువపత్రంతో భూమి విరాసత్‌.. కేసు నమోదు తర్వాతి తరపు యుద్ధ విమాన ప్రాజెక్ట్‌పై జర్మనీ పునరాలోచన ఆస్ట్రేలియాకు తాండూరు కందుల తొలి ఎగుమతి.. అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణకు గుర్తింపు ఉత్తర కొరియాపై మరోసారి అమెరికా కఠిన ఆంక్షలు పెద్దగట్టుకు రాష్ట్ర పండుగ హోదా.. అభివృద్ధికి రూ.100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి:డా శివ ప్రసాద్ యాదవ్ ఆఫ్రికా దేశాల భాగస్వామ్య సదస్సులో పుతిన్ కీలక వ్యాఖ్యలు ఎస్‌హెచ్‌ఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు “మందు తాగి చస్తామంటేనే స్పందిస్తారా?”.. ఎనిమిదేళ్ల భూ సమస్యపై కదిలిన రెవెన్యూ అధికారులు రువాండా రక్షణ మంత్రిత్వ శాఖపై అమెరికా తీవ్ర ఆంక్షలు.. కాంగో ఘర్షణల నేపథ్యంలో సంచలన నిర్ణయం

ప్రజా సేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి

Select Suryaa Now
ప్రజా సేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
  • గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి
  • మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి
  • మంత్రి డా.స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవంగా ఎన్నికైన కొండపి నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు

    సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

     ప్రజాసేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కొండపి నియోజకవర్గం పరిధిలోని పొన్నలూరు, మర్రిపూడి, కొండపి మండలాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు మరియు మర్రిపూడి మండల జడ్పిటిసి సభ్యుడు బుధవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డా.స్వామిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ...ప్రజల మద్దతుతో స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం శుభ పరిణామన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజా సేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అధికారును సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కష్టపడి పని చేసి కూటమి అభ్యర్థులను గెలుపుకు కృషి చేయాలని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.