బయ్యప్పగారిపల్లిలో ఎన్నికల సందడి.. ప్రజల్లోకి ఎంపీటీసీ అభ్యర్థి
పలమనేరు మేజర్ న్యూస్ బయ్యప్పగారిపల్లి పంచాయతీ సెగ్మెంట్-2 పరిధిలో ఎంపీటీసీ అభ్యర్థి పి. వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా దొమ్మరపామ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కోటూరు గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థి కోరారు. స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలను తెలుసుకుంటూ గ్రామస్తులతో మమేకమయ్యారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
రిపోర్టర్: అనిల్ కుమార్ యాదవ్