పెమ్మసాని తో యాగంటి భేటీ!
పెమ్మసానితో యాగంటి భేటీ.!
మాచర్ల:
గుంటూరులో కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను పల్నాడు జిల్లా మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యాగంటి మల్లికార్జున రావు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం గుంటూరులోని మంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా ఇరువురూ పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుని మర్యాదపూర్వకంగా సంభాషించుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీ ఆత్మీయతను చాటుకుంది.
తవిటి శ్రీకాంత్. సీనియర్ రిపోర్టర్ మాచర్ల.