BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో అర్హత సాధించిన శిద్దా ఆరాధ్య ఎల్లంపేటలో భవన నిర్మాణంపై ఆరోపణలు.. అధికారుల తనిఖీలు ఎప్పుడు..? ప్రజా సేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే..-తహసీల్దార్ శ్రీకాంత్ బయ్యప్పగారిపల్లిలో ఎన్నికల సందడి.. ప్రజల్లోకి ఎంపీటీసీ అభ్యర్థి అవినీతిని తరిమి కొట్టండి.. అభివృద్ధికి ఓటేయండి రాపూరు బీజేపీలో అసమ్మతి సెగ.. మండల నాయకుల పార్టీ పదవులకు రాజీనామా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా కోడలు ఉపాసన.. తాతగారితో కలిసి ప్రత్యేక పూజలు వారం రోజుల్లో సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి : అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి 15వ వార్డులో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం అదితీ రావు హైదరి గ్లామరస్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్ అవుతున్న టాలీవుడ్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ పువ్వాడి దంపతులకు సత్కారం తీవ్రవాదులకు జగన్ కు తేడా నే లేదు. 30 న భరద్వాజ మాస్టర్ జన్మదినోత్సవ వేడుకలు...

పేద విద్యార్థి వైద్య విద్యకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ మరో రూ.లక్ష సాయం

Select Suryaa Now
పేద విద్యార్థి వైద్య విద్యకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ మరో రూ.లక్ష సాయం

మర్పల్లి, మేజర్‌ న్యూస్‌ : పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదని, ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదనే స్ఫూర్తితో తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ పేద విద్యార్థి వైద్య విద్యకు అండగా నిలిచారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్‌ గ్రామానికి చెందిన గణపురం అనిల్‌కు ఎంబీబీఎస్‌ చదువు కొనసాగించేందుకు మరో రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అనిల్‌ తల్లిదండ్రులు మొగులయ్య దంపతులు దినసరి కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన అనిల్‌ కష్టపడి చదివి 2024లో గాంధీ ఆస్పత్రిలో ఎంబీబీఎస్‌ వైద్య విద్య అభ్యసించే అవకాశం దక్కించుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు వైద్య విద్య కొనసాగించేందుకు ఇబ్బందిగా మారాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ గత ఏడాది రూ.లక్ష ఆర్థిక సాయం అందించి విద్యార్థిని ప్రోత్సహించారు. తాజాగా మరో రూ.లక్ష అందజేసి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో అనిల్‌ చదువు మధ్యలో ఆగిపోకుండా స్పీకర్‌ అందిస్తున్న సహాయం ఎంతో తోడ్పాటునివ్వనుంది. వైద్యుడిగా ఎదిగి సమాజానికి సేవ చేయాలనే అనిల్‌ లక్ష్యానికి ఈ ఆర్థిక చేయూత భరోసానిస్తోంది. ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌ వికారాబాద్‌ నియోజకవర్గ కన్వీనర్‌ చామల రఘుపతి రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.