BREAKING
బెల్జియం ట్యాక్స్ ఏజెన్సీపై సైబర్ దాడి కలకలం.. ఆన్‌లైన్ పోర్టల్ తాత్కాలిక నిలిపివేత ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..! ఎయిర్‌ కెనడా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన ఒప్పందం ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నేత నింగ్యారి యాదగిరి* సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి* 2030 లక్ష్య సాధనకు భారత్ బృహత్తర ప్రణాళిక ఏఐ ట్రైనింగ్ వర్కర్లపై చట్టవిరుద్ధ నిఘా ఆరోపణలను ఖండించిన స్కేల్ ఏఐ రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక పెరుగుతున్న వాతావరణ ముప్పుపై భీమా రంగం హెచ్చరిక శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి! చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అమెరికా వ్యాపార దిగ్గజాల కీలక డిమాండ్..రాజకీయ స్థిరత్వం, సుస్థిర ఆర్థిక విధానాలే ప్రాధాన్యత తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్

నిరుద్యోగ యువత విజయానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

Select Suryaa Now
నిరుద్యోగ యువత విజయానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌
తాండూరు, మేజర్ న్యూస్: నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. తాండూరు పట్టణంలోని విలియమూన్‌ స్కూల్‌లో బీఎంఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 250 మంది అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల సన్నద్ధతలో తోడ్పాటునందించేందుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. గతంలో 2018లో పరిగిలోనూ బీఎంఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఉచిత కోచింగ్‌ కార్యక్రమం నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌, స్టడీ మెటీరియల్‌ అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. సమయం ఎంతో విలువైనదని, దానిని వృథా చేయకుండా కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ దీపక్‌ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు దారాసింగ్‌, తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.