పువ్వాడి దంపతులకు సత్కారం
పామూరు, మేజర్ న్యూస్ : పామూరు మండల ఎంపీపీగా పువ్వాడి వెంకటేశ్వర్లు, తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీగా ఆయన సతీమణి పువ్వాడి వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల నుచ్చుపొద టీడీపీ సీనియర్ నాయకుడు ఆరెకొండ హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పువ్వాడి దంపతులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆరెకొండ హరిప్రసాద్ మాట్లాడుతూ పువ్వాడి వెంకటేశ్వర్లు ఎంపీపీగా, వెంకటలక్ష్మి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పదవులకు వన్నె తెచ్చేలా పనిచేయాలని ఆకాంక్షించారు. మండల అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి పువ్వాడి దంపతులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. అనంతరం పువ్వాడి వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మిలను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మల్లెబోయిన బాల బ్రహ్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.