సమాజ భద్రతలో భాగస్వాములు కావాలి..-ఎస్ఐ తోట తిరుపతి
సమాజ భద్రతలో భాగస్వాములు కావాలి..
-ఎస్ఐ తోట తిరుపతి
బెజ్జంకి/మేజర్ న్యూస్:
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా మారాయని.ప్రజలు ముఖ్యమైన ప్రదేశాలు,తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకోవాలని భద్రతలో భాగస్వాములు కావాలని ఎస్ఐ తోట తిరుపతి పిలుపునిచ్చారు.మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలో బుధవారం ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో గ్రామస్తులకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గ్రామాలలో నిరంతర నిఘాకు దోహదపడే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఎస్ఐ తిరుపతి కోరారు.సర్పంచ్ ఎర్రల జానకి,ఉప సర్పంచ్ పద్మ,వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.(సూర్యరిపోర్టర్,భాస్కర్,బెజ్జంకి)