బేల్దార్ అవతారమెత్తిన షరణి
నెల్లూరు, మేజర్ న్యూస్ : తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటూ, మంత్రి నారాయణ ఒకవైపు నెల్లూరు అభివృద్ధి పనుల్లో దూసుకుపోతుంటే, ఆయన కుమార్తె షరణి మరోవైపు ప్రజలతో నేరుగా మమేకమవుతూ సరికొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. హోదా, ఆడంబరాలను పక్కనపెట్టి సామాన్యులలో ఒకరిగా కలిసిపోతున్న ఆమె ప్రచార శైలి ప్రజలను, ఓటర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.నేటి ప్రచారంలో భాగంగా సామాన్యులతో మమేకమవుతూ..మరో అడుగు ముందుకేసి బేల్దార్ అవతారమెత్తారు. స్వయంగా ఇటుకలు, కంకర మోస్తూ శ్రామిక వర్గం పడుతున్న కష్టాన్ని దగ్గరుండి చూశారు. కార్మికుల భుజం తట్టి, వారికి అండగా ఉంటానని భరోసానిస్తూ సాగిన ఆమె ప్రచారం స్థానికులలో తీవ్ర సంచలనం రేపింది.అంతటితో ఆగకుండా ప్రచార మార్గంలో ఉన్న ఒక చెరకు రసం దుకాణం వద్ద ఆగి, స్వయంగా మిషన్ లో చెరకు గడలు పెట్టి రసం తీశారు. వడగట్టిన చెరకు రసాన్ని ఆడికి వచ్చిన కార్యకర్తలకు పంచారు. ఆ తర్వాత మరికొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి, పైనాపిల్ స్వహస్తాలతో కోసి కార్యకర్తలకు తినిపించారు. ఈ ఆత్మీయ పలకరింపులు ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతిరోజూ వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ, మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థులకు ఓట్లు అడుగుతూ వినూత్నమైన ప్రచారంతో...కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతున్న షరణి ప్రచారం కూటమికి తిరుగులేని బలాన్ని ఇస్తోంది. తండ్రి అభివృద్ధి సంక్షేమాలకు, తనయ ఆత్మీయ పలకరింపు తోడవడంతో కూటమి అభ్యర్థుల భారీ విజయం ఖాయమైపోయిందని స్థానికులు కొనియాడుతున్నారు.