BREAKING
అభివృద్ధి చేశాం.. ఆదరించి గెలిపించండి! కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట చేతికొచ్చిన పంట నీటిపాలు..!! *అన్నదాతను ఆదుకోండి * పుర పోరులో నేడే పోస్టల్ బ్యాలెట్ -తెల్ల బంగారంపై అర్నబ్ తుఫాన్ పంజా… --వల్లాపురం రైతులకు కన్నీళ్లు మిగిలాయి! వైరా రూరల్ (సూర్య న్యూస్):- సిపిఎం ఎంపీటీసీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చంద్రబాబు స్ఫూర్తితోనే ఎమ్మెల్యే యరపతినేని సామాజిక న్యాయం - ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాదిగ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్య పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన గవర్నర్ అశోక్ గజపతి రాజు ఫ్యాన్ గుర్తుకు ఓటు.... సుపరి పాలనకు చోటు. ఇందుకూరుపేట మండల వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన బందెల వెంకటరమణ.. *జిల్లాలోని రైతు బజార్లలో బియ్యం విక్రయాలు – జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సెక్రటేరీయేట్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 30వ డివిజన్‌లో నూనె రుషి యాదవ్ విస్తృత ప్రచారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు... డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు 27వ డివిజన్‌లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం

ప్రాంతాల అభివృద్ధి పట్టం కడుతోంది

Select Suryaa Now
ప్రాంతాల అభివృద్ధి పట్టం కడుతోంది

ప్రాంతాల అభివృద్ధే పట్టం కడుతోంది..!

-ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

మాచర్ల:

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో విస్తృతంగా కొనసాగుతున్న ప్రాంతాల అభివృద్ధే అభ్యర్ధులకు పట్టం కడుతోందని మాచర్ల శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో  బుధవారం పట్టణంలోని 28,29 వార్డులో ఉదయం పర్యటించి ప్రచారం చేపట్టగా.., సాయంత్రం 24,25 వార్డులో కూటమి అభ్యర్ధుల గెలుపుతో పాటు చైర్మన్ అభ్యర్ధి యెనుముల సుష్మాకేశవరెడ్డి విజయం కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., మున్సిపాలిటి పరిధిలో దాదాపు రూ. 260 కోట్లతో తాగునీటి ప్రాజెక్ట్ అమృత్ స్కీం, నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇన్నర్ బైపాస్ రోడ్డు పనులు చేపట్టామన్నారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి తప్ప.., ఎక్కడా అరాచకాన్ని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలజడులు సృష్టించి, అరాచకంతో స్ధానిక సంస్ధ ఎన్నికల్లో గెలవాలని సైకోసైన్యం అధ్యక్షుడు జగన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన కుట్రలను ఆ పార్టీ నాయకులకు గ్రహించి, తత్వం బోధపడి పోటీ నుంచి తప్పుకున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్ధులు అఖండ మెజారిటితో విజయం సాధించాలని ఎమ్మెల్యే జూలకంటి సతీమణి శోభారాణి, తనయులు గౌతమ్ జూలకంటి కోరారు. బుధవారం 13,14,9,10,11,12,4,5 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల తరుఫున ప్రచారం చేపట్టారు. వందల కోట్లతో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ.., అభ్యర్ధులతో పాటు చైర్మన్ అభ్యర్ధి సుష్మా కేశవరెడ్డిని భారీ మేజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యాగంటి మల్లికార్జునరావు, రాజబోయిన మధు, గుండాల శ్రీనివాస్ యాదవ్,బృంగా రమణారావు, సాతులూరి కుమార్, కొమెర దుర్గారావు, వజ్రం నాయక్, కొమెర అనంతరాములు, విరేశ్వరరావు,దొడ్డ చందు, చల్లా నాగమణి, కేతావత్ భవాని బాయ్, దాసరి అంజయ్య, జరుగుమల్లి అంకాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

మాచర్ల సీనియర్ రిపోర్టర్ తవిటి శ్రీకాంత్.