BREAKING
పొదలకూరు మండలానికి నేను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు:సొమిరెడ్డి పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర! కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం

-తెల్ల బంగారంపై అర్నబ్ తుఫాన్ పంజా… --వల్లాపురం రైతులకు కన్నీళ్లు మిగిలాయి! వైరా రూరల్ (సూర్య న్యూస్):-

Select Suryaa Now
-తెల్ల బంగారంపై అర్నబ్ తుఫాన్ పంజా…  --వల్లాపురం రైతులకు కన్నీళ్లు మిగిలాయి!   వైరా రూరల్ (సూర్య న్యూస్):-

వైరా రూరల్ (సూర్య న్యూస్):- అక్టోబర్ 28  ;అర్నబ్ తుఫాన్ ప్రభావం పత్తి రైతుల పాలిట శాపంగా మారింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వైరా మండలం వల్లాపురం గ్రామంలో తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షం, వీచిన బలమైన గాలులకు సుమారు 200 ఎకరాల్లో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. కోతకు సిద్ధంగా ఉన్న పత్తి చేలు నేలకొరిగి, వర్షపు నీటికి తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇప్పటికే కూలీల కొరతతో పత్తి కోతలు ఆలస్యమవుతున్నాయి. పంట పూర్తిగా చేతికొచ్చినా, కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పత్తి తీయలేకపోయారు. ఈ క్రమంలో తుఫాన్ విరుచుకుపడటంతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పత్తి తీయని చేలలో పంట పూర్తిగా దెబ్బతింది. పంటను కాపాడుకునే అవకాశం లేకపోవడంతో రైతులు నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగు ఖర్చుల కోసం వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు పంట నష్టం తీరని దెబ్బగా మారింది. పంట చేతికొస్తే అప్పులు తీర్చుకోవచ్చని, కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చని ఆశించిన రైతులకు తుఫాన్ తీవ్ర నిరాశను మిగిల్చింది. కళ్లముందే పంట నేలపాలవడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పెట్టుబడులు ఎలా రాబట్టుకోవాలి? అప్పులు ఎలా తీర్చాలి? అనే ఆందోళన వారిని వెంటాడుతోంది.
వల్లాపురం గ్రామంలో దెబ్బతిన్న పత్తి పంటను సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ అధికారులు తక్షణమే పరిశీలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరుతున్నారు. ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పంట నష్టంపై అధికారులు తక్షణమే స్పందించి, బాధిత రైతులకు న్యాయం చేయాలని వల్లాపురం రైతులు కోరుతున్నారు.