పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి
పొన్నూరు మేజర్ న్యూస్ :- పొన్నూర మండలంలోని మునిపల్లె పచ్చలతాడిపర్రు దండమూడి గ్రామాలలో బోర్ల కింద సాగు చేసిన వరి పైర్లను గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి (జెడిఏ) ముళ్ళపూడి పద్మావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నేలవాలిన వరి పంటను సిబ్బందితో కలిసి ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా జెడిఏ మాట్లాడుతూ……ప్రస్తుతం వరి పైరు పాలు పోసుకునే దశలో ఉందని, ఈ దశలో పైరు నేలకు వాలడం వల్ల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. రైతులు వెంటనే తమ పొలాలను గమనించి, వరి చేలల్లో నీరు నిల్వ ఉండకుండా బయటకు తీసివేయాలని సూచించారు.బాగా నేలకు వాలిన వరి పైరును 4 నుండి 6 పనలు కలిపి కట్టలుగా కట్టి నిలబెట్టాలని రైతులకు సూచించారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, వ్యవసాయ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పొన్నూరు డివిజన్ ఏడీఏ వి. రామకోటేశ్వరి వ్యవసాయ విస్తరణ అధికారి ఐ. శ్రీకాంత్, వీఏఏ మాణిక్యరావు, ఎంపీఈఓ ఎస్. సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- సిలార్