మానకొండూరును కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ డిమాండ్
సూర్య - మానకొండూర్ : మానకొండూరు మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బిజెపి మండల అధ్యక్షులు కందిరాజు రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కొండ్ర సుమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర ఫిల్మ్ బోర్డు సభ్యులు రాపాక ప్రవీణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో మానకొండూరును చేర్చకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. మండలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, ఖరీఫ్ సీజన్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ తీసుకుని మానకొండూరును కరువు మండలంగా ప్రకటించేలా చూడాలని డిమాండ్ చేశారు. లేనియెడల మండల రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు భాషబోయిన ప్రదీప్ యాదవ్, శీలం కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు మీసా రమణయ్య, ఎదులాపురం అశ్విన్ తేజ, యువమోర్చా మండల అధ్యక్షుడు కొండ్ర వరప్రసాద్,సీనియర్ నాయకులు సొన్నకుల శ్రీనివాస్, కత్తి ప్రభాకర్ గౌడ్, మార్కొండ రమేష్ పటేల్, మాచర్ల కోటేశ్వర్, నందగిరి బలరాం, ఆరేపల్లి సునంద్, తదితరులు పాల్గొన్నారు.