15వ వార్డులో హోరేత్తిన టిడిపి ప్రచారం
15వ వార్డులో హోరెత్తిన టిడిపి ప్రచారం
ఆత్మకూరు,సోమా వెంకటసుబ్బయ్య,మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణంలోని 15 వ వార్డులో బుధవారం రాత్రి కూటమి ఆధ్వర్యంలో ని తెలుగుదేశం ఎన్నికల ప్రచారం హోరెత్తించారు. మున్సిపల్ చైర్ పర్సన్ టిడిపి అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తనయుడు యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి 15వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి మొహిబుల్ల, నాయకుడు బషీర్, తెలుగు మహిళ నాయకురాలు చండ్రపాటి మంగమ్మ తదితరులు ప్రచార రధంపై ఎన్నికల ప్రచారాన్ని సాగించగా జనం విరివిగా పాల్గొని నీరాజనాలు పలికారు. తెలుగుదేశం మున్సిపల్ అభ్యర్థి డాక్టర్ షకీలా, వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి మొహిబుల్లా లకు అందరూ ఓట్లు వేసి విజయం చేకూర్చాలని తారక్ నాథ్ రెడ్డి కోరారు.