మండలంలో ఎంపిటిసిలుగా టిడిపి కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్(
అభినందించిన మండల టిడిపి నాయకులు
సిఎస్ పురం,మేజర్ న్యూస్: మండలపరిషత్ ఎన్నికల సందర్భంగా మండలంలోని 13ఎంపిటిసి స్థానాలను టిడిపి కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల మండల టిడిపి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తంచేసి అభినందించారు. బుధవారం స్థానిక మండల టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎంపిటిసిలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపిపి అభ్యర్థి డాక్టర్ బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు(వెంగయ్య),తోడేటిగోపి,బత్తుల కృష్ణకుమారి రమణయ్య, పాలగుళ్ల రామ్మోహనరెడ్డి,ఆవుల వెంకటేశ్వరరావు,గూడంశెట్టి రవికుమార్,మన్నేపల్లి శిరీష
కార్తీక్,చింతం వెంకటసుబ్బమ్మ, దాసరి మహాలక్ష్మమ్మ,దనేంకుల లక్ష్మీదేవి,గల్లావీరసుబ్బమ్మ,సూరిపోగురమేష్,ఇర్లబాబులను మండల టిడిపి అధ్యక్షుడు బొబ్బూరిరమేష్,జడ్పిటిసి అభ్యర్థి గుంటిమడుగు శ్రీనివాసవర్మ అధ్వర్యంలో టిడిపి పరిశీలకులు నాయకులు అభిమానులు ఘనంగా సత్కరించి అభినందన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ మండల పరిషత్ ఎన్నికల సందర్భంగా ఎంపిటిసిల ఏకగ్రీవ ఎన్నికకు కృషిచేసిన ప్రతిఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అదేవిధంగా జడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి కూటమి నాయకులు సమిష్టి కృషిచేసి జడ్పిటిసి అభ్యర్థి గుంటిమడుగు శ్రీనివాసవర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎంపిటిసిలను ఆయా గ్రామాల నాయకులు అభిమానులు అభినందన శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపిపి అభ్యర్థి డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య, జడ్పిటిసి అభ్యర్థి గుంటిమడుగు శ్రీనివాసవర్మ,నియోజకవర్గ టిడిపి నాయకులు పల్లాల నారపరెడ్డి, షేక్ షరీఫ్,మండల నాయకులు యన్.సి.మాలకొండయ్య, మన్నేపల్లి శ్రీనివాసులు, చెరుకుపల్లె వెంకటరెడ్డి,పునుగుపాటి రవికుమార్,ఏ.రామకృష్ణంరాజు,బొర్రాజు శ్రీనివాసులు,బత్తుల వెంకటాద్రి,దాసరి మల్లికార్జున,శ్రీనివాసులు పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.