BREAKING
మీ బిడ్డగా ఆదరించి... గెలిపించండి 32వ డివిజన్ లోని సమస్యలన్నిటిని 6 నెలల్లోగా పరిష్కరిస్తాం... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టి వెంకట కీర్తి... జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతి. శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ విజయ్ దంపతులు కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి లెనిన్ పాండియన్ మూవీ రివ్యూ, వ్యవస్థపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి: రామాయణం సినిమా నుండి కమనీయమైన జతగూడె పాట విడుదల శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నైస్ పౌండేషన్ వంశధార కు భారీ వరదలు 41 వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... కార్పొరేటర్ గా నసీమున్నీసా ను గెలిపించండి.. టీడీపీ మేయర్ అభ్యర్థి జెబీ శ్రీనివాస్

చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Select Suryaa Now
చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

నెలకు రూ.19,500 వేతనం.. ఈ వారంలోపు దరఖాస్తు చేసుకోవాలి

(రంగారెడ్డి - మేజర్ న్యూస్) : మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU) పరిధిలో చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ (CRV-03) డ్రైవర్ పోస్టు భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి శాంత శ్రీ తెలిపారు.

రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండటంతో పాటు, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు బాలలను అత్యవసర పరిస్థితుల్లో రక్షించి, సంబంధిత బాలల సంరక్షణ సంస్థలు లేదా హాస్టళ్లకు సురక్షితంగా తరలించాల్సి ఉంటుందని తెలిపారు. షిఫ్ట్ విధానంలో విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.19,500 వేతనం చెల్లించనున్నట్లు వెల్లడించారు. బాలల పరిరక్షణకు సంబంధించిన అత్యవసర సేవల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించగల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకోవాల్సిన చిరునామా: ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ వారంలోపు జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU), బాలరక్ష భవన్, వెంగల్ రావ్ నగర్, మధురానగర్ మెట్రో స్టేషన్, పిల్లర్ నంబర్ 1467, హైదరాబాద్ చిరునామాలో భౌతికంగా సమర్పించాలి. దరఖాస్తుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఇతర సంబంధిత ధ్రువపత్రాల ప్రతులను జతచేయాలని ఆమె సూచించారు.