BREAKING
పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్ష ఫీజు చెల్లించిన ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రోళ్ల సుధాకర్ రెడ్డి అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తులతో నివాళి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంరక్షక ప్రభుత్వ ప్రధానిగా నెతన్యాహు బ్రిటన్ పన్ను విధానాలపై బెట్టింగ్ దిగ్గజం ఎంటైన్ హెచ్చరిక ఉద్యోగాన్ని వదిలి.. ప్రజాసేవ వైపు! ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా మొజాంబిక్‌కు చైనా ఆర్థిక ఊరట.. రుణ చెల్లింపుల పునర్వ్యవస్థీకరణకు కీలక ఒప్పందం స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొనడంతో భారీగా ప్రాణనష్టం దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో టాస్క్ ఫోర్స్, పోలీసులు దాడులు తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు అమెజాన్ డివైసెస్ విభాగంలో మరోసారి ఉద్యోగాల కోత జర్నలిస్టులపై వేధింపుల కేసు..బ్రిటన్ మితవాద కార్యకర్త టామీ రాబిసన్‌కు దోషిగా కోర్టు తీర్పు రేమండ్ లైఫ్‌స్టైల్ త్రైమాసిక ఫలితాల్లో పడిపోయిన లాభాలు మాల్తుమ్మెద చెన్నకేశ్వర ఆలయం గుట్టపై చిరుత పులి సంచారం క‌ల‌క‌లం.

అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు

Select Suryaa Now
అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు

పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరిన ఎంపీ మాగుంట , ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

గిద్దలూరు: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గిద్దలూరులో ఉమ్మడి జిల్లా ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి , ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. బీజేపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జె.వి. నారాయణ తో పాటు 2వ వార్డు టీడీపీ అభ్యర్థి పాలుగుల్ల శ్రీదేవి , 3వ వార్డు జెనసేన అభ్యర్థి ఉల్లపు బాల చెన్నయ్య, 27 వ వార్డు టీడీపీ అభ్యర్థి అబ్బు పద్మావతి, 28వ వార్డు జనసేన అభ్యర్థి యల్లా పద్మావతి గార్లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కమలం, సైకిల్, గాజు గ్లాసు గుర్తులపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. " ఎమ్మెల్యే మాట్లాడుతూ పరాయి ప్రాంతం నుంచి వ్యాపార నిమిత్తం వచ్చిన వారిని నమ్మవద్దు అని, గత ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు అని నేడు మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం, దాదాపు పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది గిద్దలూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.