ఎన్నికల సమరంలో సైనికుల్లా కదలండి - స్తానిక సంస్థల్లో కూటమి విజయానికి కృషి చేయండి – మంత్రి ఆనం పిలుపు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ–ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా ఎన్నికల సమరంలో కదలాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కూటమి అభ్యర్థులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, "ఎన్నికలంటే కేవలం అభ్యర్థుల పోరాటం కాదని, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కదిలి, ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, ప్రతి ఓటరును కలుసుకుని కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లోతెలుగుదేశం, ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. "మన లక్ష్యం ఒక్కటే.. ప్రతి స్థానంలో కూటమి విజయం. మన బలం కార్యకర్తలే.. మన ఆయుధం అభివృద్ధి.. మన గమ్యం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం" అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారంలో ప్రతి నాయకుడు బాధ్యత తీసుకుని క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేయాలని, సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తాళ్లూరు గిరినాయుడు, బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి, తుమ్మల చంద్రారెడ్డి, కాటంరెడ్డి రవీంద్రా రెడ్డి, డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్, ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.