BREAKING
ప్రజలకు సకాలంలో బియ్యం అందేలా చర్యలు చేపట్టాలి... అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ రంగంలో కీలక పరిణామం..సబ్సిడీల నిబంధనలు సడలించిన జర్మనీ సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదాభార్గవి ఏఐ రంగంలో నిధుల సేకరణ జోరు.. వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల రిస్క్ అపెటైట్‌కు అసలు పరీక్ష నెదర్లాండ్స్ టెలికాం దిగ్గజం ఓడిడో కొత్త సీఈఓగా తిషా వాన్ లామెరెన్ నియామకం 15వ వార్డులో హోరేత్తిన టిడిపి ప్రచారం మానకొండూరును కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ డిమాండ్‌ పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యం..ఎమ్మెల్యే..! *ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా* బీజేపీనేత వెంకటేశ్ మండలంలో ఎంపిటిసిలుగా టిడిపి కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్( చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం యాభై ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ సభ్యులు రాక క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో సంచలనం.. 400 మిలియన్ డాలర్లు సేకరించిన అప్‌విండ్ స్టార్టప్ మానకొండూర్ సొసైటీకి తూకం, మాయిశ్చర్ యంత్రాల అందజేత

వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం

Select Suryaa Now
వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం  10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం

అనుమసముద్రంపేట మేజర్ న్యూస్  :    ఏఎస్ పేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆర్వో పనితీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ మేరకు మంగళవారం జరిగిన ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పై తీవ్ర వివాదం నెలకొంది ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏఎస్పేట మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు గాను నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు దాంతో మండలంలోని నాలుగు ఎంపీటీసీ సెగ్మెంట్లకు చెందిన వైసిపి ఎంపీటీసీఅభ్యర్థులు, మండలంలోని నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలోని 10 ఎంపీటీసీ సెగ్మెంట్లకు గాను హసనాపురం, చౌట భీమవరం, చిరమణ, గుంపర్లపాడు నాలుగు సెగ్మెంట్లను ఏకగ్రీవమైనట్లు మంగళవారం ప్రకటించారు దాంతో వైసిపి ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీడీవో కార్యాలయం వద్దకు నాయకులు కార్యకర్తలతో తరలివచ్చి తాము ఎలాంటి విత్ డ్రా లు చేయలేదని, నకిలీ సంతకాలతో తమ నామినేషన్లను ఉపసంహరణ చేశారంటూ ఆరోపణలు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అధికార పార్టీకి తొత్తులుగా మారి ఇలాంటి పనులు చేయడం దుర్మార్గమైన చర్య అని, సంబంధిత పత్రాలను పరిశీలించి నిజా నిజాలను వెల్లడించాలని వైసిపి పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు పేర్కొన్నారు కొంతసేపు నిరసన కార్యక్రమం అనంతరం సంఘం సీఐ ఏఎస్పేట ఎస్సైలు పోలీస్ సిబ్బందితో వచ్చి గుంపులుగా ఉండకూడదని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు ఈ మేరకు ఏఎస్పేట మండలంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఉన్నతాధికారులు స్పందించి నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని తమను తిరిగి ఆయా సెగ్మెంట్లలో పోటీలో ఉండేలా చర్యలు చేపట్టాలని వైసిపి ఎంపీటీసీ అభ్యర్థులు కోరారు