ప్రకృతి అందాలకు నెలవు.. పర్యాటకానికి కొత్త వెలుగు! జిల్లెలగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్కుతో హుస్నాబాద్‌కు కొత్త గుర్తింపు
హుస్నాబాద్ : ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారికి ఆహ్లాదాన్ని పంచుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలిచే దిశగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని జిల్లెలగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్కు ప్రాధాన్యం సంతరించుకుంటోంది. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన వాతావరణం, ప్రకృతి అందాలతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ పార్కు అభివృద్ధి స్థానిక ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
అడవుల సంరక్షణే ప్రధాన లక్ష్యం:
పట్టణాలు, పట్టణ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం, అటవీ భూములను ఆక్రమణల నుంచి కాపాడటం, స్థానిక జీవవైవిధ్యాన్ని సంరక్షించడం అర్బన్ ఫారెస్ట్ పార్కుల ప్రధాన ఉద్దేశం. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల కార్యక్రమం కూడా ఇదే లక్ష్యంతో కొనసాగుతోంది. నడక మార్గాలు, ప్రకృతి పరిశీలన, పర్యావరణ అవగాహన వంటి కార్యక్రమాలకు ఈ పార్కులు ఉపయోగపడనున్నాయి.
పర్యాటక అభివృద్ధికి కొత్త దారి:
హుస్నాబాద్ ప్రాంతంలో ఇప్పటికే ప్రకృతి సోయగాలకు పేరుగాంచిన ఎల్లమ్మ చెరువు, రాయికల్ జలపాతాలు, మహాసముద్రం గండి వంటి ప్రదేశాలతో పాటు జిల్లెలగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్కును కూడా పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ముందుకు వచ్చింది. 2026 జనవరి 10న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. పార్కులో ట్రెక్కింగ్, వాకింగ్ వంటి సౌకర్యాలతో పాటు పిల్లల కోసం ప్రత్యేక ప్రదేశం, ప్రజలు సమావేశమయ్యే స్థలం, పండ్ల చెట్ల పెంపకం వంటి అంశాలపై ఆయన సూచనలు చేశారు.
చరిత్రకు.. ప్రకృతికి అనుసంధానం:
ఈ ప్రాంతానికి స్వతంత్ర సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రతో సంబంధం ఉండడంతో ఆయన పేరుతో పాటు కల్పించే అంశాన్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తావించారు సమీపంలోని భైరవ స్వామి ఆలయం సర్వాయి పాపన్న కోటలను పర్యాటక ఆకర్షణలుగా అభివృద్ధి చేయాలని ఆలోచన ఈ ప్రాంత చారిత్రాత్మక ప్రాధాన్యతను మరించి పెంచే అవకాశం ఉంది
ప్రజలకు ఆహ్లాదం పర్యావరణానికి మేలు :
అర్బన్ ఫారెస్ట్ పార్కులకు కేవలం విహార కేంద్రాల గానే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడే సహజ వనరులుగా ఉపయోగపడతాయి చెట్ల పెంపకం వల్ల పచ్చదనం పెరగడంతో పాటు వర్షపు నీరు భూములకు ఇంకెందుకు భూగర్భ జలాల పరిరక్షణకు తోడ్పాటు లభిస్తుంది విద్యార్థులకు ప్రకృతి వన్యప్రాణులు జీవ వైవిధ్యం పై అవగాహన కల్పించేందుకు కూడా ఉపయోగపడతాయి.
అభివృద్ధి పనులు వేగవంతం కావాలి :
జిల్లెల గడ్డ అర్బన్ ఫారెస్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హుస్నాబాద్ ప్రాంతానికి మరొక పర్యాటక ఆకర్షణ తోడై అవకాశం ఉంది అయితే పార్కులో ప్రతిపాదించిన సౌకర్యాలు మొక్కలు సంరక్షణ తాగునీరు మరుగుదొడ్లు పరిశుద్ధం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది స్థానిక ప్రజలు విద్యార్థులు ప్రకృతి ప్రేమికులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తిచేసి నిరంతర నిర్వహణకు చర్యలు తీసుకుంటే ఈ ప్రాంతం పచ్చదనానికి ప్రతీకగా నిలువ గలదు.మొత్తంగా జిల్లెల గడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్ హుస్నాబాద్ ప్రాంతానికి పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి కొత్త అవకాశాలు అందించే ప్రాజెక్టుగా నిలువనుంది ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి సాధిస్తే భావితరాలకు పచ్చని వారసత్వాన్ని అందించినట్టు అవుతుంది.