అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి
వెల్దుర్తి, ( సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్):వెల్దుర్తి పట్టణంలో రాబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త తిరువీధి రమేష్ శెట్టి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బుధవారం ఆయన పారిశ్రామికవేత్త రాంప్రసాద్‌తో కలిసి వెల్దుర్తి పట్టణంలోని 14వ వార్డులో ఉన్న మదీనా మసీదును సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడ స్థానిక ముస్లిం సోదరులను కలిసి ఆయన పరిచయం చేసుకున్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తాను అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నానని, ఇందుకు అందరి మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా రమేష్ శెట్టి మాట్లాడుతూ.. గతంలో 28 సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేసిన తమ పూర్వీకుల మాదిరిగానే తాము కూడా ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి లేని పాలనను అందిస్తామని హామీనిచ్చారు. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా, ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించి పరిష్కరించేలా ముందుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో హఫీజ్, హుస్సేన్ బాషా, ఎస్. ఎదురువా భాష, మసాలా మౌలాలి, హోటల్ మబాషా, బోరింగ్ మాభూసా, ముబారక్ టైలర్ తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం