BREAKING
మీ బిడ్డగా ఆదరించి... గెలిపించండి 32వ డివిజన్ లోని సమస్యలన్నిటిని 6 నెలల్లోగా పరిష్కరిస్తాం... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టి వెంకట కీర్తి... జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతి. శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ విజయ్ దంపతులు కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి లెనిన్ పాండియన్ మూవీ రివ్యూ, వ్యవస్థపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి: రామాయణం సినిమా నుండి కమనీయమైన జతగూడె పాట విడుదల శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నైస్ పౌండేషన్ వంశధార కు భారీ వరదలు 41 వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... కార్పొరేటర్ గా నసీమున్నీసా ను గెలిపించండి.. టీడీపీ మేయర్ అభ్యర్థి జెబీ శ్రీనివాస్

తహసీల్దార్ వ్యాఖ్యలతో దుమారం!

Select Suryaa Now
తహసీల్దార్ వ్యాఖ్యలతో దుమారం!

తహసీల్దార్ వ్యాఖ్యలతో దుమారం!

“మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి” అంటూ వ్యాఖ్యలు?

-సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

-కలెక్టర్ కు వాట్సాప్ ద్వారా బాధితుడి ఫిర్యాదు

 

సిద్దిపేట రూరల్, మేజర్ న్యూస్: ఇంటి నిర్మాణానికి అనుమతుల విషయమై అడిగిన వ్యక్తితో సిద్దిపేట రూరల్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ మాట్లాడిన తీరు వివాదానికి దారితీసింది. “మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి” అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బండచర్లపల్లికి చెందిన బాధితుడు రంజిత్ కుమార్ కలెక్టర్ కు వాట్సాప్ ద్వారా వీడియో పంపి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

అనుమతులు అడిగితే అసహనం!

బుధవారం గ్రామానికి వచ్చిన తహసీల్దార్‌ను గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి అనుమతుల గురించి అడగగా, దురుసుగా మాట్లాడారని రంజిత్ కుమార్ ఆరోపించాడు. ఇంటి నిర్మాణానికి సుడా అధికారులు అనుమతులు ఇస్తున్నారని చెప్పినప్పటికీ, తనపై బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు.

ప్రభుత్వ భూమిలో నిర్మాణాలపై హెచ్చరించా: తహసీల్దార్

ఈ విషయమై తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ ను వివరణ కోరగా గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. కొందరు ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించేందుకు అనుమతులు కోరారని, ప్రభుత్వ భూమిని కబ్జా చేయనివ్వబోననిహెచ్చరించినట్లు వివరించారు.బాధితుడి ఆరోపణలు, తహసీల్దార్ వివరణ నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.

(సూర్య రూరల్, రమేష్)