నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర. : ఏర్పాట్ల పరిశీలన.
ఎస్‌ఐఆర్ (SIR)పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరుకానున్న నేపథ్యంలో, హెలిప్యాడ్ ఏర్పాట్ల కోసం బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించి, నాయకులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జమాల్, సాదం అరవింద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజి నరేష్,జింక సురేందర్, ఈశ్వర్, కూన శశాంక్, మాజీ కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, నరేందర్, నాయకులు కందుల హరీష్, భరత్ ,స్వాప్నిక్ , నేరేళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు.