BREAKING
ఏఐ రంగంలో నిధుల సేకరణ జోరు.. వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల రిస్క్ అపెటైట్‌కు అసలు పరీక్ష నెదర్లాండ్స్ టెలికాం దిగ్గజం ఓడిడో కొత్త సీఈఓగా తిషా వాన్ లామెరెన్ నియామకం 15వ వార్డులో హోరేత్తిన టిడిపి ప్రచారం మానకొండూరును కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ డిమాండ్‌ పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యం..ఎమ్మెల్యే..! *ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా* బీజేపీనేత వెంకటేశ్ మండలంలో ఎంపిటిసిలుగా టిడిపి కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్( చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం యాభై ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ సభ్యులు రాక క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో సంచలనం.. 400 మిలియన్ డాలర్లు సేకరించిన అప్‌విండ్ స్టార్టప్ మానకొండూర్ సొసైటీకి తూకం, మాయిశ్చర్ యంత్రాల అందజేత ఎన్నికల సమరంలో సైనికుల్లా కదలండి - స్తానిక సంస్థల్లో కూటమి విజయానికి కృషి చేయండి – మంత్రి ఆనం పిలుపు స్టార్‌లింక్ పరికరాల మంటల కేసు.. బల్గేరియా అభ్యర్థనపై విచారణ జరుపుతున్న జర్మనీ కోర్టు తహసీల్దార్ వ్యాఖ్యలతో దుమారం!

నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర!

Select Suryaa Now
నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర!

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కోలేకే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించే కుట్రలకు తెరతీశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో పలువురు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ, అక్రమంగా ఉపసంహరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లను బుధవారం కలసి వినతిపత్రం అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడతూ  అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చేజర్లలో పది నామినేషన్లలో తొమ్మిదింటిని తిరస్కరించడం, ఏఎస్‌పేటలో పది స్థానాలకు సంబంధించి నాలుగు నామినేషన్లను తిరస్కరించడం ఏమిటని ప్రశ్నించారు.  కొన్ని చోట్ల నామినేషన్లన్నీ ఆమోదించి, మరికొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే ఇబ్బందులు సృష్టించడం వెనుక కారణాలేమిటో అధికారులు సమాధానం చెప్పాలని నిలదీశారు. నామినేషన్ల తిరస్కరణకు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా కొందరు అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లు చూపించడంపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు.  అభ్యర్థులు స్వయంగా ఉపసంహరణ పత్రాలు ఇచ్చారా,  వారి సంతకాలే ఉన్నాయా,  వారు సమర్పించినట్లు చెబుతున్న పత్రాలకు ఆధారాలేమిటి అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలన్నారు. వీడియో ఆధారాలు చూపాలని కోరితే చూపడం లేదని ఆరోపించారు. అభ్యర్థుల ప్రమేయం లేకుండా ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేశారని స్పష్టం తెలుస్తోందని అన్నారు.  ఆత్మకూరు సీఐ గంగాధర్, ఇతర పోలిసు అధికారులు మా పార్టీ వారిని బయటకు పంపి కూటమి నాయకులకు వత్తాసు పలుకుతూ వచ్చారని, పోలిసుల పాత్రపైనా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వీటన్నింటిపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఆనం అంత భయపడుతున్నారా?

రెండేళ్ల పాలనపై అంత నమ్మకం ఉంటే ఎన్నికలను స్వేచ్ఛగా ఎదుర్కోవాలని, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇలా భయపడి అభ్యర్థులను బరిలో లేకుండా చేయడం ఎందుకని మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రశ్నించారు. ఏకగ్రీవాల పేరుతోనో, నామినేషన్ల తిరస్కరణలతోనో ఎన్నికల పోటీని పరిమితం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.  ప్రజలే నిర్ణయించాల్సిన విజయాలను ముందుగానే ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలకు అధికారులు తావివ్వకూడదన్నారు. తిరస్కరించిన నామినేషన్లకు సంబంధించిన పత్రాలు, కారణాలు, ఉపసంహరణల వీడియో ఆధారాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు విక్రమ్‌రెడ్డి తెలిపారు.  ప్రతి అభ్యర్థికి ఎందుకు అన్యాయం జరిగిందో విచారించి, ఎన్నికల నిబంధనలు అనుమతిస్తే తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా అవసరమైతే కేంద్ర బలగాలను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ స్పందన కోసం ఒక రోజు వేచి చూస్తామని, అప్పటికీ న్యాయం జరగకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.