తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం
వింజమూరు మేజర్ న్యూస్ : వింజమూరు జడ్పిటిసి సభ్యులుగా పోటీ చేస్తున్న గణపవరం సుదర్శన్ రెడ్డి శంకవరం ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేస్తున్న గంగపట్ల వెంగయ్యలు నంది గుంట గ్రామంలోఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును వివరిస్తూ ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేస్తున్న కృషిని వివరిస్తూ సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు వింజమూరు మండలం అభివృద్ధి పథంలో పయనించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆశీస్సులతో ఈ ఎన్నికల బరిలో నిలిచినట్లు వారు తెలియజేశారు వింజమూరు మండలం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి విజయాన్ని అందించాలని వారు అభ్యర్థిస్తున్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చల్ల వెంకటేశ్వర్లు యాదవ్ తిరుపతి ఆచారి. బూదాలలక్ష్మణ్ ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.