పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు
మహబూబ్ నగర్ సూర్య న్యూస్ -
బీసీ మేధావుల సంఘం మరియు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండుగ సాయన్న జీవిత చరిత్రపై ఉపన్యాస పోటీ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్ కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఈ రోజు బెక్కం జనార్ధన్ మరియు బీసీ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రభాకర్ విడుదల చేశారు.మహబూబ్నగర్ పట్టణంలో విద్యార్థిని, విద్యార్థులకు ఆరు నుంచి ఏడవ తరగతి జూనియర్స్ ఎనిమిది తొమ్మిది పది విద్యార్థిని విద్యార్థులకు సీనియర్ విభాగం రెండుగా పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని బీసీ మేధావుల సంఘం ముఖ్య సలహాదారు పండుగ సాయన్న నవల రచయిత బెక్కం జనార్ధన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. బీసీ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రభాకర్ మాట్లాడుతూ ,ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు నవంబర్ 5వ తారీఖు వరకు డ్రాయింగ్ మరియు ఉపన్యాస పోటీల్లో పాల్గొని విద్యార్థిని విద్యార్థుల యొక్క లిస్టును అందజేయాలని వారు తెలిపారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆవిష్కరణ కార్యక్రమంలో అనురాధ ,రవికుమార్ ,మల్లికార్జున్ ,శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు.
ఓం ప్రకాష్ -మహబూబ్ నగర్ ..