10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం
కర్నూలు మేజర్ న్యూస్ కె ఎం సి:
కర్నూలు నగరంలోని 10వ వార్డులో దండగేరి నుంచి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్.వి. మోహన్ రెడ్డి గారు, కర్నూలు నియోజకవర్గ అసెంబ్లీ పరిశీలకులు శ్రీ చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ మాణిగాంధీ గారు, శ్రీ నరసింహ యాదవ్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా 10వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి దీప్తి గారిని, కర్నూలు నగర మేయర్ అభ్యర్థి శ్రీమతి యు. సుశీల గారిని ప్రజలకు పరిచయం చేస్తూ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో 10వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు