BREAKING
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. పశ్చిమ గోదావరిలో ఏరియల్ సర్వే, నష్ట తీవ్రత పరిశీలన! నర్సాపురం పరిధిలో అర్నబ్ తుఫాన్ బీభత్సం. నర్సాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీ.. శంషాబాద్‌లో ఇన్నోవా కారు బీభత్సం.. మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టి పల్టీలు, ఒకరికి తీవ్ర గాయాలు! రిషికేశ్‌లో కాంగ్రెస్ న్యాయ యాత్ర హోరు.. నటరాజ్ చౌక్ నుంచి త్రివేణి ఘాట్ వరకు భారీ ర్యాలీ, బీజేపీ ప్రభుత్వ విధానాలపై నిరసన గళం! ఢిల్లీలో మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాలు: అఖండ దీపం వందేళ్ల సంబరాలు వాస్కో సండే మార్కెట్ అగ్నిప్రమాదంపై గోవా సీఎం సమీక్ష.. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాస చర్యలకు ఆదేశం! సీఏక్యూఎమ్ ‘పవన్’ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన: వాయు నాణ్యత చర్యలపై కేంద్రం ఫోకస్ వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల పంజా.. వేర్వేరు దాడుల్లో ఐదుగురు పోలీసుల దుర్మరణం, భద్రతా బలగాల తీవ్ర గాలింపు చర్యలు! జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 మిషన్ ప్రయోగం: మరింత బలోపేతం కానున్న స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం

నర్సాపూర్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

Select Suryaa Now
నర్సాపూర్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

నర్సాపూర్;దేశంలో కొనసాగుతున్న సర్‌ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. నర్సాపూర్‌లో గురువారం నాడు విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ మరోసారి అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని ఆరోపించారు. సర్‌ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ఈ ప్రక్రియ వల్ల ఏ పౌరుడి ఓటు కూడా తొలగిపోదని విద్యార్థులకు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్య విభాగం ప్రారంభం ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షలతో యంత్రాల ఏర్పాటు చేశారుగ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన దంత వైద్య విభాగాన్ని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రారంభించారు. తన ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షలు వెచ్చించి అధునాతన దంత వైద్య యంత్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విభాగం అందుబాటులోకి రావడంతో దంత సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. దంత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, బిజెపి నాయకులు, పెద్ద రమేష్ గౌడ్, సంఘసాని సురేష్, అంజా గౌడ్, చిన్న రమేష్ గౌడ్, నాగేష్, ప్రేమ్ కుమార్, నాగ ప్రభువు గౌడ్, ఉదయ్ కుమార్ గౌడ్, నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.