ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు..
రామాయంపేట;ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజాంపేట మండల కేంద్రం నుంచి గురువారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి బయలుదేరారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు ఢిల్లీకి తరలివెళ్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీ సిద్ధరాములు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భాను ప్రకాష్ రెడ్డి, బొమ్మన మల్లేశం, రామ్ చందర్ నాయక్, బాబు నాయక్, నసీరుద్దీన్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.