BREAKING
నలభై వేల మందికి పైగా హెచ్‌డీఎస్‌ సిబ్బంది డేటా లీక్ కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు నిర్మించిన ప్రముఖ కమెడియన్ వడివేలు.. ఫోటోలు వైరల్ భద్రతా కారణాల రీత్యా ఏడిపెక్ సదస్సుకు ఎగ్జాన్, చెవ్రాన్ ఎగ్జిక్యూటివ్‌ల పర్యటన రద్దు! అమెరికా సైన్యంలో అత్యంత రహస్య సమాచారం లీక్ చేసిన సీనియర్ జనరల్ వర్చాస్త్‌పై వేటు! అల్లు అర్జున్ డైరెక్టర్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు బాలీవుడ్‌లో నాకంటూ సరైన స్థానం లేదు.. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే మేలంటున్న దర్శకుడు అమోల్ గుప్తే చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

2,850 ఎకరాల్లో వరి పంటకు ముంపు

Select Suryaa Now
2,850 ఎకరాల్లో వరి పంటకు ముంపు

 

క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన వ్యవసాయ, రెవెన్యూ అధికారులు

మెలియాపుట్టి. అక్టోబర్ 29. మేజర్ న్యూస్....
తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలుకు ముంపునకు గురైన వరి పొలాలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెలియాపుట్టి మండలంలోని 38 రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 2,850 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేసి, నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్లు మండల వ్యవసాయ అధికారి ఎస్‌. దానకర్ణుడు తెలిపారు.
మెలియాపుట్టి మండలంలోని చాపర, మెలియాపుట్టి, పెద్దపద్మాపురం, సిరియాకండి, దొరబలాపురం, కోసమాల, వసుంధర, గంగరాజుపురం, జోడూరు, జాడపల్లి, ఎంసీపీకొత్తూరు తదితర గ్రామాల్లో అధికారులు పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. వరి పొలాల్లో నిలిచిన నీరు, పంట పరిస్థితిని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ముంపు కారణంగా పంట దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వరి పొలాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించేందుకు రైతులు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారి దానకర్ణుడు సూచించారు. పొలాల్లో నీరు తగ్గిన వెంటనే ఎకరాకు హెక్సాకొనజోల్‌ 400 మి.లీ. లేదా ప్రొపికొనజోల్‌ 200 మి.లీ. చొప్పున పిచికారీ చేసుకోవాలని తెలిపారు. దీనివల్ల పంటకు తెగుళ్లు సోకకుండా నివారణ చర్యలు చేపట్టవచ్చని వివరించారు.
వర్షాలకు వరి పంట నేలకొరిగిన పొలాల్లో వరి కంకులను నిలబెట్టి కట్టలుగా కట్టుకోవాలని అధికారులు సూచించారు. అనంతరం ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా ధాన్యం రంగు మారకుండా, మొలకెత్తకుండా నివారించవచ్చని తెలిపారు. పంట పరిస్థితిని బట్టి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు. ఈ పరిశీలనలో గ్రామ వ్యవసాయ సహాయకులు జగదీష్‌, ప్రేమ, నిహారిక, పుష్ప, త్రినాథ్‌, పల్లవి తదితరులు, పలువురు రైతులు పాల్గొన్నారు.