BREAKING
సినిమా బాగలేకపోతే ప్రేక్షకులు నేరుగా మొహం మీదే చెబుతారు: విక్టరీ వెంకటేశ్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సామాగ్రి సిద్దం అమ్మ అండగా ఉంటా...ఓటు వెయ్యి తల్లి...! -54వ డివిజన్ పరిధిలో బోయళ్ళ శాంతి ప్రచారం మీ బిడ్డగా ఆదరించి... గెలిపించండి 32వ డివిజన్ లోని సమస్యలన్నిటిని 6 నెలల్లోగా పరిష్కరిస్తాం... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టి వెంకట కీర్తి... జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతి. శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ విజయ్ దంపతులు కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి లెనిన్ పాండియన్ మూవీ రివ్యూ, వ్యవస్థపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి: రామాయణం సినిమా నుండి కమనీయమైన జతగూడె పాట విడుదల

మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..!

Select Suryaa Now
మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..!

మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..!
- టిడిపి ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించండి
- ఎంపీటీసీ అభ్యర్థులు శ్రీనివాసులు ,పుల్యాల శాంతి

నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్-: ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ధికి కృషి చేస్తానని టిడిపి జడ్పిటిసి అభ్యర్థి బండి రమణమ్మ తెలిపారు. మండల కేంద్రమైన పగిడ్యాల తో పాటు మండల పరిధిలోని నెహ్రూ నగర్, పాత ముచ్చుమర్రి,కొత్త ముచ్చుమర్రి, వనములపాడు ,సంకిరేణి పల్లె ,బీరవోలు, లక్ష్మాపురం, యం.గణపురం తూర్పు, పడమర ప్రాతకోట, ఎన్.గణపురం గ్రామాల ప్రజలు తనను ఆశీర్వదించి సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలో నెలకొన్న సమస్యల కోసం జిల్లా పరిషత్ నిధులతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పగిడ్యాల మండలంలోని ఎస్సీ కాలనీలో గురువారం పగిడ్యాల సింగిల్ విండో అధ్యక్షుడు బొగ్గుల దామోదర్ రెడ్డి , మండల కన్వీనర్ మహేశ్వరెడ్డి, టిడిపి నాయకులు పుల్యాల రాజశేఖరెడ్డి, పుల్యాల వాసురెడ్డి ఆధ్వర్యంలో పగిడ్యాల మండల టిడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బండి రమణమ్మ , ఎంపిటిసి అభ్యర్థులు శ్రీనివాసులు ,పుల్యాల శాంతి  పర్యటించారు. ఈ సందర్భంగా పగిడ్యాల సింగిల్ విండో అధ్యక్షుడు బొగ్గుల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.గ్రామంలో మండలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం
జరిగిందన్నారు. దీర్ఘకాల కింద సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం నిరంతరం కృషి చేస్తుందనన్నారు కూటమి ప్రభుత్వ హయాంలో  అభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అభివృద్ధిని చూసి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి బండి రవణమ్మ ఎంపీటీసీలు శ్రీనివాసులు, పుల్యాల శాంతి లకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.