వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి
మండల అగ్రికల్చర్ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న
ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే తెగుళ్లు ఆశించే అవకాశం
అగ్రికల్చర్ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి
గరుగుబిల్లి, అక్టోబర్ 29,(మేజర్ న్యూస్):బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న వరి పంట పొలాల్లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న వెల్లడించారు.మండల కేంద్రం లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం స్థానిక విలేకరులతో మాట్లా డారు.ఈమేరకు వరి పంటలను కాపాడుకోవడానికి రైతులు తక్షణమే తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్త లతో పాటు వరి పంటలో తీసుకోవల సిన జాగ్రత్తలు అదే విధంగా వరి పంట పొలాల్లో నీటి నిల్వను నివారించడం తదితర అంశాలు గురించి మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న వివరించారు.పొలంలో ఎక్కువ రోజులు నీరు నిలిచి ఉంటే వరి పంటకు వేరు కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంద న్నారు.ఈమేరకు పొలంలోని అదనపు నీటిని బయటకు పంపించేందుకు తక్షణమే కాలువ (బోదెలు) ఏర్పాటు చేయాల్సి ఉంద న్నారు.ఎరువుల వినియోగంకు సంబం ధించి తుఫాను వర్షాలు తగ్గేంతవరకు ఎటువంటి రసాయనిక ఎరువులు (ముఖ్యంగా యూరియా) వేయకూడద న్నారు.వర్షాలకు ఎరువులు కొట్టుకు పోయి పెట్టుబడి వృధా అవుతుందని అగ్రికల్చర్ అధికారి తుమ్మనపల్లి జోత్స్న పేర్కొన్నారు.తెగుళ్ల నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత తేమ మరియు ఉక్కపోత వల్ల దోమపోటు (సుడి దోమ) లేదా అగ్గితెగులు ఆశించే అవకాశం ఉందన్నారు.దీంతో రైతులు వరి పంటలను నిరంతరం గమనిస్తూ తెగుళ్లు ఆశించిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు మేరకు తగు సస్యరక్షణ చర్యలు చేప ట్టాల్సి ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న వెల్లడించారు.