అమ్మ అండగా ఉంటా...ఓటు వెయ్యి తల్లి...! -54వ డివిజన్ పరిధిలో బోయళ్ళ శాంతి ప్రచారం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు అండగా నిలిచి ఓటు వేసి ఆశీర్వదించు తల్లి అని 54వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతి ప్రచారంలో అభ్యర్థించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆ డివిజన్ పరిధిలో కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని తిరుపతి నగర భవిష్యత్తుకు డివిజన్ అభివృద్ధి నా ధ్యేయమని పేర్కొన్నారు. రాబోయే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. 54వ డివిజన్ నుండి ఎన్డీఏ కూటమి తరపున జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి, ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేసిన వెంటనే పది నిమిషాల్లో మీకు అందుబాటులోకి వచ్చి ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రచారంలో ఎన్డీఏ కూటమి నాయకులు క్రికెట్ విజయ్ కుమార్, మధు, అక్కినపల్లి లక్ష్మయ్య, సుధాకర్ రావు, లక్ష్మీ, ప్రమీలమ్మ, శేఖర్, సుధాకర్, మంజులమ్మ, స్థానిక ప్రజలు కూటమి నాయకులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్