వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి
వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్
సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తం..డాక్టర్ తిరుమలప్రసాద్
గ్రామస్థాయి వైద్య సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందజేత
గరుగుబిల్లి, అక్టోబర్ 29, మేజర్ న్యూస్:తుఫాను సందర్భంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో త్రాగునీరు కలుషితమైనందున ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని గరుగుబిల్లి మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ వెల్లడించారు.ఈ మేరకు గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.ప్రస్తుత సీజన్ లో ఆశించే వ్యాధులుపై తీసు కోవలసిన జాగ్రత్తల పై వైద్యాధి కారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ తెలియజేశారు. వర్షాకాలంలో ఆశించే వ్యాధులు డెంగ్యూ మరియు మలేరియా దోమలు కుట్టడం వల్ల వస్తాయని అదే విధంగా టైఫాయిడ్ మరియు డయేరియా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తాయని ఈమేరకు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమతెరలు లేదా కాయిల్స్ వాడటం, మరియు కాచి వడపోసిన నీటిని మాత్రమే త్రాగాలని తెలియజేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నేప థ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేలా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని...అదే విధంగా ముందస్తు జాగ్రతలపై ప్రజల్లో అవగా హన పెంపొందిస్తూ అప్రమత్తం చేయా లని తెలియజేయడం జరిగిందని వైద్యాధి కారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ పేర్కొన్నారు.సీజనల్ వ్యాధులు దోమల ద్వారా గాలి ద్వారా మరియు కలుషిత నీటితో ప్రబలడం జరుగుతుందని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీల పరిధిలోని వైద్య సిబ్బం ది సీజనల్ వ్యాధులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింద న్నారు.ఏగ్రామంలోనైనా జ్వరాలు తదితర వ్యాధులు ప్రబలినట్లయితే తక్షణమే వైద్య సహాయం అందజే యడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు సమాచారం అందించాలని తెలిపారు. వర్షాకాలంలో ఎక్కువగా చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ఆశించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. ఈమేరకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.అదే విధం గా జ్వరం ఎక్కువ రోజులు పాటు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్ర దించాలన్నారు.గ్రామ పంచాయతీల పరిధిలోని వైద్య సిబ్బంది ప్రజల ఆరోగ్య సమస్యలను స్పష్టంగా తెలుసు కోవాలన్నారు.దీర్ఘకాలిక రోగులు వారికి ఇచ్చిన మందులు సక్రమంగా వేసుకు నేలా పర్యవేక్షణ చేస్తూ ఆరోగ్య మెరుగు తీరుపై వైద్య పరీక్షలు జరిపి గమనించాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర మందులతో పాటు అవసరమైన మందుల కొరత లేదని వైద్యాధికారి డాక్టర్ తిరుమల ప్రసాద్ స్పష్టం చేశారు. గ్రామ పంచా యతీల పరిధిలోని పక్కా కాలువల్లో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేయాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయా గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేలా అవసరమైన చర్యలు చేపడు తున్నామని వైద్యాధి కారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ వెల్లడించారు.