గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
మండలంలోని నాయుడుపాలెంలో గృహప్రవేశ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ బద్రి భూపాల్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి కి పూజల నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో గ్రామ అభివృద్ధి గురించి చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ లక్ష్మీ కోరారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీను మాజీ మండల టిడిపి అధ్యక్షులు సోమేపల్లి శ్రీను టిడిపి నాయకులు పాల్గొన్నారు.