కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు
నల్లగొండ జిల్లాలో
కట్టంగూరు మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు ఊట్కూరు ఏడుకొండలు, సీనియర్ నాయకుడు గుండాల మల్లేష్ గౌడ్, రైతు సంఘం మాజీ మండల అధ్యక్షుడు చిట్యాల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ ముప్పిడి యాదయ్య, పాదూరు శశిపాల్ రెడ్డి, రేకల రాజు, ఊట్కూరు నాగయ్య తదితరులు పాల్గొన్నారు