BREAKING
కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి లెనిన్ పాండియన్ మూవీ రివ్యూ, వ్యవస్థపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి: రామాయణం సినిమా నుండి కమనీయమైన జతగూడె పాట విడుదల శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నైస్ పౌండేషన్ వంశధార కు భారీ వరదలు 41 వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... కార్పొరేటర్ గా నసీమున్నీసా ను గెలిపించండి.. టీడీపీ మేయర్ అభ్యర్థి జెబీ శ్రీనివాస్ 2,850 ఎకరాల్లో వరి పంటకు ముంపు విశ్వక్ సేన్ కల్ట్ సినిమా రిలీజ్ ట్రైలర్ లాంచ్, వైల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్న మాస్ కా దాస్ తుఫాను ప్రభావం వలన పాఠశాలలు పరిశీలన

సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ

Select Suryaa Now
సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంపి.గన్నవరం మండలంలోని జి.పెదపూడి, ఉడి మూడి గ్రామాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు  గిడ్డి సత్యనారాయణ  సందర్శించారు.

పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న తుఫాన్ బాధితులను ఎమ్మెల్యే  పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో అందుతున్న సహాయక చర్యలు, వసతులపై ఆరా తీశారు.

బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు మరియు ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించే పనులను ఎమ్మెల్యే గిడ్డి పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చెట్లను వెంటనే తొలగించి, రహదారులపై రాకపోకలను పునరుద్ధరించే చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

తుఫాన్ ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే  గిడ్డి సత్యనారాయణ  భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.