తుఫాను ప్రభావం వలన పాఠశాలలు పరిశీలన
విద్యాశాఖ అధికారి తిరుమలరావు
పాతపట్నం అక్టోబర్ 29,మేజర్ న్యూస్:పాతపట్నం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల కాపు గోపాలపురం ఆవరణలో వరదనీరు చేరినందువలన రేపు పాఠశాలకు పిల్లలు రావడానికి ఇబ్బంది ఉన్నట్టు గుర్తించడం జరిగిందని విషయం తెలుసుకుని వెంటనే మండల విద్యాశాఖ అధికారి తిరుమలరావు పాఠశాల ఉపాధ్యాయులతో వెళ్లి నేరుగా గురువారం పరిశీలించారు. తక్షణ చర్యలు చేసి ఉపాధ్యాయులతో మాట్లాడి ఆ వర్షపు నీటిని తొలగించి బాగు చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు.