లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్
కొండాపూర్ ; మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీలో గురువారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారుల వివరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్డుల్లో పొందుపరిచిన భద్రతా ఫీచర్లు నకిలీ కార్డులు, మోసాలకు అడ్డుకట్ట వేయడంలో దోహదపడతాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ రేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జీపీవో సుమలత. ఉపసర్పంచ్ ప్రియాంక నర్సింలు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వార్డు సభ్యులు ఎల్లయ్య, గొల్ల శ్రీకాంత్, బంటు సత్యనారాయణ, నవనీత వీరారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు