BREAKING
ప్రజలకు సకాలంలో బియ్యం అందేలా చర్యలు చేపట్టాలి... అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ రంగంలో కీలక పరిణామం..సబ్సిడీల నిబంధనలు సడలించిన జర్మనీ సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదాభార్గవి ఏఐ రంగంలో నిధుల సేకరణ జోరు.. వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల రిస్క్ అపెటైట్‌కు అసలు పరీక్ష నెదర్లాండ్స్ టెలికాం దిగ్గజం ఓడిడో కొత్త సీఈఓగా తిషా వాన్ లామెరెన్ నియామకం 15వ వార్డులో హోరేత్తిన టిడిపి ప్రచారం మానకొండూరును కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ డిమాండ్‌ పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యం..ఎమ్మెల్యే..! *ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా* బీజేపీనేత వెంకటేశ్ మండలంలో ఎంపిటిసిలుగా టిడిపి కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్( చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం యాభై ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ సభ్యులు రాక క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో సంచలనం.. 400 మిలియన్ డాలర్లు సేకరించిన అప్‌విండ్ స్టార్టప్ మానకొండూర్ సొసైటీకి తూకం, మాయిశ్చర్ యంత్రాల అందజేత

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి

Select Suryaa Now
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం ఉదయం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి పరిశీలించారు.  ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 7/1, 8/1, 9/1, 9/2, 10/1 నంబర్లు గల హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి, అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, ఓటర్లందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.  జిల్లా ఎన్నికల పరిశీలకురాలి వెంట ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి తదితరులు ఉన్నారు.